న్యూఢిల్లీ: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రతతో పాటు సీఆర్పీఎఫ్ కమాండో సెక్యూరిటీ కల్పించింది. సినిమా విడుదల తర్వాత ఆయనకు ముప్పు పెరిగిన నేపథ్యంలో భద్రత పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్ లోయ నుంచి కశ్మీర్ పండిట్లు వలస వెళ్లిపోయారన్న నేపథ్యంలో అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఇటీవలే విడుదలైంది.