చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆఫీసుకి పంపినట్టు డీఎంకే పార్టీ వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే ఓటమిపాలైంది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పనిచేస్తామని స్టాలిన్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఆయన పంపిన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు లోక్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారు.