Rahul Gandhi : లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన.. తూటాల్లాంటి మాటలతో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోవడం మూడు రకాల బలగాలను ఉపయోగించి దేశంలో చక్రవ్యూహం నిర్మించిందని విమర్శించారు.
కేంద్రం నిర్మించిన చక్రవ్యూహం ప్రజలకు హానికరంగా మారిందని, ఈ చక్రవ్యూహాన్ని తాము ఛేదించి తీరుతామని రాహుల్‌గాంధీ శపథం చేశారు. కేంద్ర చక్రవ్యూహంలో భాగమైన మూడు రకాల బలగాల్లో ఒకటి ఆర్థిక బలగమని, ఇది అదానీ, అంబానీ చేతుల్లో ఉన్నదని అన్నారు. రెండో బలగం కేంద్ర దర్యాప్తు సంస్థలని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు.
#WATCH | In Lok Sabha, LoP Rahul Gandhi says, “The ‘Chakravyuh’ that you have built is harming crores of people. We are going to break down this ‘Chakravyuh’. the biggest way of doing this, one that scares you, is the Caste Census. Like I said that INDIA Alliance will pass… pic.twitter.com/B0eXWsDrCN
— ANI (@ANI) July 29, 2024
#WATCH | In Lok Sabha, LoP Rahul Gandhi says, “Hindustan’s nature is different. There is a formation against ‘Chakravyuh’ in every religion. In Hinduism, ‘Shiv ki Baarat’ is the opposite of ‘Chakravyuh’. Anyone can join ‘Shiv ki Baarat’, – anyone from any faith…This fight is… pic.twitter.com/mB9oJKr0u7
— ANI (@ANI) July 29, 2024
చక్రవ్యూహంలో మూడో బలగం రాజకీయ పార్టీలని రాహుల్‌గాంధీ అన్నారు. తన అధికార పీఠానికి ప్రమాదం రాకుండా సంకీర్ణంలోని ప్రధాన మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తోందని ఆరోపించారు. ఇలా ప్రభుత్వం తన సొంత అవసరాల కోసం పెట్టుబడుదారులకు వంతపాడటం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, కొన్ని ప్రాంతాలపై పక్షపాతం చూపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
ఇలా ప్రజలకు హాని చేసేలా, ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం నిర్మించిన చక్రవ్యూహాన్ని తాము ఛేదించి చూపిస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. చక్రవ్యూహం గురించి తాను కొద్ది పరిశోధన చేశానని, తన పరిశోధనలో చక్రవ్యూహం అన్నా, పద్మ వ్యూహం అన్నా ఒకటేననే విషయం తెలిసిందని, పద్మం అంటే కమలమేనని చెప్పారు. అందుకే నాడు కౌరువుల మాదిరిగా ఇప్పుడు కమలం నేతలు చక్రవ్యూహాన్ని నమ్ముకున్నారని విమర్శించారు.
నాడు ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహం ద్వారా అభిమన్యుడిని హత్య చేశారని, ఇప్పుడు కూడా ప్రధానంగా ఆరుగురు వ్యక్తులు ఈ చక్రవ్యూహంలో భాగమయ్యారని ఆరోపించారు. వారిలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, బడా వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారని చెప్పారు. అయితే శివుడి భారత దేశం (శివ్ కా భారత్) చక్రవ్యూహం పనిచేయదని అన్నారు. మహారాష్ట్రలో అదే జరిగిందని గుర్తుచేశారు.
అదేవిధంగా బడ్జెట్ హల్వా వేడుకలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారులపై వివక్ష చూపించారని రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హల్వా వేడుకలో పాల్గొన్న 20 మంది అధికారులలో కేవలం ఇద్దరు మాత్రమే దేశంలోని 95 శాతం ప్రజానీకానికి చెందినవారు ఉన్నారని చెప్పారు. వారిలో ఒక్కరు మైనారిటీ, ఒక్కరు ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఆ ఇద్దరు కూడా హల్వా వేడుక పోస్ట్‌ర్‌లో వెనుక భాగాన ఉన్నారని, వారిని ముందుకు రానివ్వలేదని విమర్శించారు.
#WATCH | In Lok Sabha, LoP Rahul Gandhi shows a poster of the traditional Halwa ceremony, held at the Ministry of Finance before the Budget session.
He says, “Budget ka halwa’ is being distributed in this photo. I can’t see one OBC or tribal or a Dalit officer in this. Desh ka… pic.twitter.com/BiFRB0VTk3
— ANI (@ANI) July 29, 2024