న్యూఢిల్లీ: నైట్ డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఎదురుగా వచ్చిన ఎస్యూవీ వాహనం డ్రైవర్ పలుసార్లు హారన్ మోగించాడు. దీనిపై అభ్యంతరం తెలిపిన సెక్యూరిటీ గార్డును వాహనంతో ఢీకొట్టి తొక్కించాడు. (SUV Runs Over Security Guard) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌కు చెందిన రాజీవ్ కుమార్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీ చేశాడు. సోమవారం ఉదయం మహిపాల్పూర్ క్రాసింగ్ వద్ద క్యాబ్ దిగాడు. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు.
కాగా, రోడ్డు క్రాసింగ్ వద్ద ఎస్యూవీ వాహనం రాజీవ్ కుమార్ సమీపానికి వచ్చింది. డ్రైవర్ పలుసార్లు హారన్ మోగించాడు. హారన్ మోగించవద్దని రాజీవ్ కుమార్ చెప్పాడు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్, తన వాహనంతో కుమార్‌ను ఢీకొట్టాడు. వాహనాన్ని రివర్స్ చేసి రోడ్డుపై పడిన కుమార్‌ను టైర్లతో తొక్కించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు సెక్యూరిటీ గార్డు రాజీవ్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎస్యూవీ వాహనం డ్రైవర్ విజయ్ను గుర్తించి అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली के महिलापाल पुर में सिक्योरिटी गार्ड पर चढ़ा दी एसयूवी थार। हॉर्न बजाने से मना करने पर दिया घटना को अंजाम। वसंत कुंज पुलिस ने आरोपी को किया गिरफ्तार। pic.twitter.com/APWIwPb34r
— NBT Hindi News (@NavbharatTimes) May 5, 2025