Road rash : రోడ్ ర్యాష్ (Road rash) వీడియో గేమ్‌ను రియల్ లైఫ్‌లో అమలు చేశాడో యువకుడు. తన స్కూటీపై సింగిల్‌గా వెళ్తున్న అతను పక్కన స్కూటీపై వెళ్తున్న ఫ్రెండ్స్‌ను కాలితో తన్నాడు. ఆ తర్వాత మరోసారి ప్రయత్నం చేస్తుండగా అప్పటికే వాళ్లను అనుసరిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర (Maharastra) లోని థానే (Thane) పట్టణ శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రోడ్ ర్యాష్ అనే ఒక వీడియో గేమ్ ఉంటుంది. ఆ గేమ్‌లో ఓ రైడర్ బైక్‌పై వెళ్తూ.. పక్కన బైక్‌లపై వెళ్తున్న వారిని తన్ని పడేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. ఈ గేమ్‌ను ఓ యువకుడు రియల్‌లైఫ్ అమలు చేశాడు. తన స్నేహితులతో కలిసి బైకులపై వెళ్తూ.. గేమ్ మొదలుపెట్టాడు. అతను సింగిల్‌గా వెళ్తూ.. పక్కన బైక్‌లపై డబుల్‌గా వస్తున్న స్నేహితులను తన్నాలనేది అతని ప్లాన్.
ఆ మేరకు తన పక్కన మరో స్కూటీపై వెళ్తున్న స్నేహితులను అతడు కాలితో తన్నాడు. దాంతో స్కూటీ బ్యాలెన్స్ కోల్పోయి పడబోతుండగా రైడర్ కంట్రోల్ చేశాడు. ఆ తర్వాత నిందితుడు మరోసారి తన మిత్రులను తన్నేందుకు ప్రయత్నించాడు. ఒక కాలు స్కూటీపై ఉంచి ఒక కాలు స్నేహితులపైకి లేపాడు. వారిని సమీపించి తన్నేందుకు ఉపక్రమించాడు.
కానీ అప్పటికే తనను అనుసరిస్తున్న పెట్రోలింగ్ పోలీసులను అతడు గుర్తించలేదు. వారు మొబైల్ వీడియో రికార్డు చేస్తూ వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసుల ఆదేశాల మేరకు నిందితుడు.. తాను తప్పుచేశానని, రోడ్లపై స్టంట్లు చేయడం కరెక్ట్ కాదని, మీరు కూడా ఎవరూ ఇలాంటి తప్పు చేయవద్దని, ఒకవేళ అలాచేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని చేతులు జోడించి చెప్పాడు.
నిందితుడి సందేశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత నిందితుడు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. మరోసారి ఇలాంటి స్టంట్లు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.