శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను చంపకూడదని అన్నారు. ఇటీవల ఉగ్రదాడులు పెరుగడం వెనుక సూత్రధారులను గుర్తించడం కోసం ఉగ్రవాదులను హతమార్చడం కంటే వారిని పట్టుకోవాలని శనివారం సూచించారు. పట్టుకున్న ఉగ్రవాదులను విచారించడం ద్వారా ఈ దాడులు నిర్వహించే విస్తృత నెట్‌వర్క్‌లు, మాస్టర్‌మైండ్స్ గురించి తెలుస్తుందని అన్నారు.
కాగా, బుద్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు జరుపాలని ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏర్పడగానే ఇలా ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తులే ఇలా చేశారా అనే సందేహం ఉంది. వాళ్లను (ఉగ్రవాదులను) పట్టుకుంటే ఇలా ఎవరు చేస్తున్నారో తెలుస్తుంది. అందుకే వారిని చంపకూడదు. వారిని పట్టుకోవాలి. వారి వెనుక ఎవరున్నారో అడగాలి. ఒమర్ అబ్దుల్లాను అస్థిరపరిచేందుకు ప్రయత్నించే ఏజెన్సీ ఉందో లేదో చెక్ చేయాలి’ అని మీడియాతో అన్నారు. ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందా లేదా అన్నది కూడా దర్యాప్తులో తెలుస్తుందని స్పష్టం చేశారు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
#WATCH | Srinagar, J&K: On being asked if Pakistan should be blamed every time for terrorist attacks in J&K including the recent Budgam terror attack, National Conference President Farooq Abdullah says, “There is no question of this, I would say that there should be an… pic.twitter.com/IXvtOxZleh
— ANI (@ANI) November 2, 2024