న్యూఢిల్లీ: పాక్ ఐఎస్ఐ మద్దతుతో తీవ్రవాద గ్రూపులు అయోధ్య రామాలయంపై పన్నిన ఉగ్రదాడి కుట్ర భగ్నమైంది. ఐఎస్ఐతో సంబంధాలున్నాయని భావిస్తున్న అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి ఫరీదాబాద్‌లో గుజరాత్ ఏటీఎస్ , హర్యానా ఎస్టీఎఫ్ అధికారులకు చిక్కాడు.
నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రనేడ్లను నిర్వీర్యం చేశారు. అయోధ్య రామాలయంపై ఉగ్రదాడి జరిపేందుకు కుట్ర జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు అనేక మార్లు రామాలయం చుట్టూ చక్కర్లు కొట్టి, సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడని, హ్యాండ్ గ్రనేడ్లు అందుకున్నాక అయోధ్యకు రావాలనుకున్నాడని తెలిసింది.