Mohana Sai Akula | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్పేస్ రిసెర్చ్ మిషన్‌కు తెలంగాణ యువకుడు ఇండియా అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ ‘లూనార్స్ రిసెర్చ్ స్టేషన్’కు అంబాసిడర్ ఫర్ ఇండియాగా మోహనసాయి ఆకుల(అమర్) ఎంపికయ్యారు. వరల్డ్ స్పేస్ వీక్ అంతర్జాతీయ సదస్సులో సంస్థ తరఫున ఇండియా ప్రతినిధిగా పాల్గొంటారు. ఆస్ట్రోబయాలజీ చివరి సంవత్సరం చదువుతున్న తనకు అంతర్జాతీయ స్పేస్ రిసెర్చ్ వేదికపై ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవమని మోహనసాయి తెలిపారు.