Kranthi Kumar | న్యూఢిల్లీ, జనవరి 12: ముక్కులోకి 22 మేకులను సుత్తితో దిగ్గొట్టుకుని తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. డ్రిల్ మ్యాన్‌గా పేరుపొందిన క్రాంతి కుమార్ పణికెర 2024లో ఇటలీలో జరిగిన లో షో డే రికార్డులో తన ప్రదర్శనతో అందరినీ విభ్రాంతికి గురి చేశాడు. ఒక్క నిమిషంలో ఒక దాని వెంట మరొకటి చొప్పున మొత్తం 22 మేకులను సుత్తితో ముక్కులోకి కొట్టి పంపించి క్రాంతి ప్రపంచ రికార్డును సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు(జీడబ్ల్యూఆర్) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గతంలో కెనడాకు చెందిన బర్నబీ క్యూ ఆర్బాక్స్ అనే వ్యక్తి 2015లో బస్కర్స్లో జరిగిన బే ఫెస్టివల్లో 30 సెకండ్లలో 15 మేకులను ముక్కులోకి పంపి ప్రపంచ రికార్డును సాధించాడు. క్రాంతి కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన నాలుకతో 57 విద్యుత్తు ఫ్యాను బ్లేడ్లను ఆపి గిన్నిస్ రికార్డ్ సాధించారు. అంతేగాక కత్తి నోట ఉంచుకుని దాంతో 1944 కిలోల వాహనాన్ని లాగడం, ఒక నిమిషంలో 17 వస్తువులను సలసల మరుగుతున్న వేడి నూనెలో నుంచి ఉత్తి చేతులతో బయటకు తీయడం వంటి విన్యాసాలతో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.
“Indian ‘Drill Man’ Kranthi Kumar Panikera breaks two Guinness World Records: stopping fan blades with his tongue and inserting 22 nails into his nose! #RecordBreaker #GWR” pic.twitter.com/2RRUlFu6Fu
— HK Chronicle (@HK_Chronicle_) January 11, 2025