ఊటీ: నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ నీలగిరి జిల్లాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో వీరసైనికుల భౌతికకాయాలకు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవదేహాల ముందు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
గవర్నర్ తమిళిసై తన ట్విట్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఆర్మీ సిబ్బంది కూడా ఆమె నివాళి అర్పించారు. జనరల్ రావత్ దేశానికి అత్యున్నత సేవలు అందించారని, బాధాతప్త హృదయంతో అమర కుటుంబాలకు నివాళి అర్పిస్తున్నట్లు ఆ ట్వీట్లో ఆమె తెలిపారు.
With profound grief, paid last respects & floral tributes to CDS Gen Bipin Rawat,his wife &11 army personnel who lost their lives in a unforeseen chopper crash at Coonoor Wellington.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 9, 2021
My salutes to Gen Rawat for his outstanding services & heartfelt condolences to bereaved families pic.twitter.com/FchdH8g7rZ