న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక కూటమి ఏర్పాట్లలో ఉన్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో భేటీ కానుండటం ఇందులో భాగమేనని అన్నారు. ప్రత్యేక కూటమికి ఏర్పాటుకు టీఆర్ఎస్తో గత నెల రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలయ్యాయని, త్వరలో బీజేపీయేతర పార్టీలు భేటీ కానున్నాయని వెల్లడించారు. ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌పవార్, మమత బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ప్రముఖ నేతలతో సమావేశం జరుగనున్నదని తెలిపారు.