స్వస్థలాలకు సూడాన్ బాధితులు
సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగి వస్తున్న తెలంగాణవాసులను వారి స్వస్థలాలకు పంపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఇందుకు ఢిల్లీలోని తె లంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల అం శంపై అన్ని రాష్ర్టాల రెసిడెంట్ కమిషనర్లను విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీ తెలంగాణభవన్‌లో అధికారులతో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
- తెలంగాణవాసులకు సర్కారు అండ
- ఢిల్లీ పార్టీ ఆఫీసులో కంట్రోల్ రూమ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 (నమస్తే, తెలంగా ణ): సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగి వస్తున్న తెలంగాణవాసులను వారి స్వస్థలాలకు పంపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఇందుకు ఢిల్లీలోని తె లంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల అం శంపై అన్ని రాష్ర్టాల రెసిడెంట్ కమిషనర్లను విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీ తెలంగాణభవన్‌లో అధికారులతో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
సూడాన్‌లో చిక్కుకున్న వా రు ప్రత్యేక విమానాల్లో తిరిగి వస్తున్నారని, ఇప్పటికే కొందరు సౌదీఅరేబియా, జెద్దాకు చేరుకున్నారని ఆయన తెలిపారు. రెండు విమానాల్లో జెద్దా నుంచి బుధవారం రాత్రి వరకు భారత్‌లోని ఢిల్లీ, ముంబైకి చేరుకొనే అవకాశమున్నదని చెప్పారు. వస్తున్నవారి లో నలుగురు తెలంగాణవాసులు ఉన్నట్టు సమాచారం ఉన్నదని చెప్పారు. వారికి సహా యం అందించేందుకు ఢిల్లీని తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తెలంగాణవాసులను బస్సుల్లో తెలంగాణభవన్‌కు తరలిస్తామని తెలిపారు. హైదరాబాద్ పంపేందుకు విమాన టికెట్లు, ప్రయాణ సౌకర్యాలతోపాటు ఇతర ఏర్పా ట్లు చేస్తున్నామని వివరించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చినవారిని ఏవిధంగా తెలంగాణకు పంపించామో.. అదే తరహాలో ఏర్పా ట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

