పాట్నా: అప్పుడప్పుడూ హిందూ దేవతల(Hindu Gods) అవతారాల్లో దర్శనమిచ్చే ఆర్జేడీ నేత, బీహార్ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) తన డ్రీమ్స్‌తో అందర్నీ థ్రిల్ చేసే విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ కల కన్నారు. ఆ కలకు చెందిన విషయాన్ని ఓ ట్వీట్లో పోస్టు చేశారు. తన కలలో కృష్ణ భగవానుడు(Lord Krishna) కనిపించినట్లు పేర్కొన్నారు. కృష్ణుడి విశ్వరూప దర్శనం జరిగిందని, కిరీటంతో ఉన్న ఆ భగవానుడు ధగధగా మెరిసిపోతున్నాడని, చక్రం.. గధాఆయుధంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడని తేజ్ ప్రతాప్ తన ట్వీట్లో తెలిపాడు.
विश्व रूप दर्शन योग मैं मुकुट से सुशोभित चक्र और गदा से सुसज्जित शस्त्रों के साथ सर्वत्र दीप्तिमान लोक के रूप में आपके रूप को देख रहा हूँ। इस चमचमाती अग्नि में आपके तेज को देख पाना कठिन है जो सभी दिशाओं से प्रस्फुटित होने वाले सूर्य के प्रकाश की भांति है। pic.twitter.com/tqcrkKH5Qo
— Tej Pratap Yadav (@TejYadav14) March 22, 2023
లాలూ ప్రసాద్(Lalu Prasad) కుమారుడైన తాజ్ ప్రతాప్.. తన ట్వీట్ వీడియోలో ఈ విషయాన్ని చెప్పాడు. బెడ్‌పై నిద్ర పోతున్న తేజ్ ప్రతాప్‌కు.. మహాభారతంలో(Mahabharat)ని యుద్ధ సన్నివేశం కలలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు దర్శనం అవ్వగానే తేజ్‌ప్రతాప్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచాడు. తేజ్ ప్రతాప్ పోస్టు చేసిన ఈ వీడియోకు తెగ్ లైక్‌లు వచ్చేస్తున్నాయి.
తేజ్ ప్రతాప్ తన విభిన్న చేష్టలతో అందర్నీ ఆకట్టుకోవడం సహజమే. ఫిబ్రవరి 22వ తేదీన ఆయన పాట్నాలోని సెక్రటేరియేట్(secretariat)కు సైకిల్‌పై వచ్చాడు. ములాయం సింగ్ తన కలలో కనిపించారని, అందుకే సైకిల్‌పై సచివాలయానికి వచ్చినట్లు చెప్పారు. గతంలో పలుమార్లు కృష్ణుడిగా, శివుడిగా తేజ్‌ప్రతాప్ వేషాలు వేశారు.