Bilibili | అంతర్జాతీయ మార్కెట్లోకి చైనా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ బిలిబిలి..!
Bilibili | యూట్యూబ్ (YouTube) కు పోటీగా అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరించేందుకు చైనా (China) వీడియో షేరింగ్ వేదిక ‘బిలిబిలి (Bilibili)’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్లకు భారీగా చెల్లింపులు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Bilibili : యూట్యూబ్ (YouTube) కు పోటీగా అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరించేందుకు చైనా (China) వీడియో షేరింగ్ వేదిక ‘బిలిబిలి (Bilibili)’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్లకు భారీగా చెల్లింపులు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1,000 వ్యూస్‌కు 0.70 డాలర్లు అంటే దాదాపు రూ.60 వరకు చెల్లించే అవకాశం ఉందని సోషల్ మీడియా (Social Media) లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చెల్లింపు వివరాలను ‘బిలిబిలి’ అధికారికంగా ధ్రువీకరించలేదు.
చైనాలో యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా గుర్తింపు తెచ్చుకున్న బిలిబిలి ఇప్పుడు పశ్చిమ దేశాల్లో అడుగు పెడుతోంది. అంతర్జాతీయ వెర్షన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. తప్పనిసరి గుర్తింపు ధ్రువీకరణ లేకుండానే ఖాతా తెరిచే అవకాశం కల్పించనుంది. విదేశీ వినియోగదారులకు అనుగుణంగా కొత్త ఫీచర్లు, స్థానికీకరించిన అనుభవాన్ని అందించనుంది. బిలిబిలి చెల్లింపులపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
స్పానిష్ భాషా హ్యాండిల్ ‘ఎల్ డుయ్’ ఈ విషయాన్ని ‘ఎక్స్’లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లను ఆకర్షించేందుకు అంతర్జాతీయ మానిటైజేషన్ అవకాశాలను బిలిబిలి అందిస్తోందని పేర్కొన్నది. ఆ పోస్టుకు 16 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. 2009లో ప్రారంభమైన బిలిబిలికి ప్రస్తుతం 35 కోట్లకుపైగా నెలవారీ యూజర్లు ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రియేటర్లు కూడా ఈ వేదికపై ఇప్పటికే తమ ఉనికిని చాటుతున్నారు.
ప్రముఖ యూట్యూబర్ మిస్టర్‌బీస్ట్ 2024లో బిలిబిలిలో కంటెంట్ పెట్టడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనకు 88 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే యూట్యూబ్‌తో పోలిస్తే బిలిబిలి ప్రకటనల వ్యవస్థ, క్రియేటర్ ఫండ్ ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఎక్కువ వ్యూస్ వచ్చినా అందరికీ భారీ ఆదాయం వస్తుందనే హామీ లేదని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Teachers | స్టూడెంట్స్ అటెండెన్స్ 95% ఉంటేనే టీచర్లకు సెలవులు.. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో అసహనం!
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ఓటీటీలో అద్భుతమైన స్పందన.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్!
మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు.. అభయ హస్తం కాస్త మొండి హస్తమయ్యిందని హరీశ్‌రావు సెటైర్లు
Kyiv Bridges: కీవ్‌లో రెండు బ్రిడ్జ్లపై రష్యా దాడి: మేయర్ క్లిచ్కో
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

