లక్నో, జూలై 13: న్యాయ విద్యను ప్రాంతీయ భాషల్లో బోధించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్ఘాటించారు. సరళమైన భాషలో న్యాయ విద్యను ఎలా బోధించాలన్న అంశంపై విద్యావేత్తలతో తరచుగా చర్చిస్తున్నట్టు తెలిపారు. సామాన్య ప్రజలకు సరళమైన భాషలో న్యాయ సూత్రాలను వివరించలేకపోతే న్యాయ వృత్తికి, న్యాయ విద్యకు మధ్య లోటు ఏర్పడుతుందని అన్నారు.
లక్నోలో శనివారం ఆయన రామ్ మనోహర్ లోహియా న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ‘న్యాయ విద్యా బోధనలో మనం ప్రాంతీయ భాషలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాంతీయ సమస్యలకు సంబంధించిన న్యాయ సూత్రాలను కూడా మనం బోధించాలి.’ అని పేర్కొన్నారు.
షెకావత్ స్కై డైవింగ్ సాహసం!
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(56) లేటు వయసులో పెద్ద సాహసానికి ఒడిగట్టారు. 14 వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో వేగంగా ప్రయాణిస్తున్న విమానం నుంచి ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకి ఔరా అనిపించుకున్నారు. ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవం సందర్భంగా హర్యానాలోని నార్నల్లో ఆయన ఈ ఫీట్ చేశారు.