అల్వార్, మే 3: పెండ్లి రోజు కూడా సెలవు తీసుకోకుండా విద్యార్థులకు క్లాస్ చెప్పి నిబద్ధత ప్రదర్శించాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ పట్టణంలో చోటుచేసుకున్నది. ప్రియేకుమార్ గౌరవ్ అనే వ్యక్తి కరెంట్ అఫైర్స్‌లో పట్టున్న అధ్యాపకుడు, ప్రపంచ రికార్డు సాధకుడు కూడా. మే 2న(సోమవారం) అతని పెండ్లి.
దీనిపై కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఐదు నెలల క్రితమే సమాచారం ఇవ్వడంతో పాటు తనకు సెలవులు అవసరం లేదని చెప్పాడు. ఉదయం సంగీత్ కార్యక్రమం అయిన తర్వాత ప్రిపేర్ అయి ఆన్లైన్ ద్వారా తన విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ పాఠాలు బోధించాడు. సాధారణంగా పెండ్లికి 4-5 రోజులు సెలవులు ఇచ్చేవారిమని, అయితే సింగిల్ క్లాస్ కూడా మిస్ కాకూడదన్న ఉద్దేశంతో గౌరవ్ లీవ్ తీసుకోలేదని కోచించ్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు.