Remove Tattoos | 15 రోజుల్లో టాటూలు తొలగించండి.. పోలీసులకు ఆదేశం
Remove Tattoos | పోలీసుల శరీరంపై టాటూలు అవమానకరమని ఆ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. పోలీస్ సిబ్బందిలో మర్యాద, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భువనేశ్వర్: పోలీసుల శరీరంపై టాటూలు అవమానకరమని ఆ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. (Remove Tattoos) పోలీస్ సిబ్బందిలో మర్యాద, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒడిశా పోలీస్ శాఖ ఈ మేరకు పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. భువనేశ్వర్, కటక్ పరిధిలోని జంట నగరాల కమిషనరేట్లకు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) ఈ లేఖ జారీ చేసింది.
కాగా, చాలా మంది పోలీస్ సిబ్బంది శరీరాలపై టాటూలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఒడిశా పోలీసులు, బెటాలియన్ ప్రతిష్టను ఇది దిగజార్చుతోంది. పచ్చబొట్లతో అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కనిపిస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత టాటూలను తొలగించాలని నిర్ణయించాం. యూనిఫాం ధరించినప్పుడు కనిపించే టాటూలను అనుమతించబోం’ అని ఆర్డర్ జారీ చేశారు.
మరోవైపు శరీరంపై టాటూలున్న పోలీసుల జాబితాలను సిద్ధం చేయాలని, 15 రోజుల్లో ఆదేశాలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఒడిశా పోలీస్ శాఖ ఆదేశించింది. అలాగే నిర్ణీత గడువులోగా టాటూలు తొలగించడంలో పోలీసులు విఫలమైతే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించింది. ముఖం, మెడ, చేతులు వంటి కనిపించే శరీర భాగాలపై టాటూలు వేయించుకోవద్దని పోలీసులకు సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

