ముంబై: టాటా సన్స్ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను పునర్ నియమించారు. ఇవాళ జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అయిదేళ్ల పాటు చంద్రశేఖరన్ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా ఉంటారు. ఇవాళ జరిగిన మీటింగ్‌లో గ్రూపు అధినేత రతన్ టాటా కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూపు సాధిస్తున్న ప్రగతి, పర్ఫార్మెన్స్పై రతన టాటా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖరన్ టర్మ్‌ను రెన్యువల్ చేయాలని రతన్ ఆదేశించారు. ఏకగ్రీవంగా చంద్రశేఖరన్ నియామకాన్ని ఆమోదిస్తున్నట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. పునర్ నియామకం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.