Karnataka | కర్నాటకలో టాటా గ్రూప్ కీలక ప్రాజెక్టులు
Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్‌ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్‌ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. కర్నాటక ప్రభుత్వం, టాటా గ్రూప్ కంపెనీలు ఎయిర్ ఇండియా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ మేరకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం ఖరారైంది.
ఒప్పందం ప్రకారం కర్నాటకలో టాటా గ్రూప్ పలు తయారీ, ఆర్అండ్డీ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎయిర్ఫ్రేం మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) నెలకొల్పుతుందని మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌తో 1200 మందికిపైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇది భారత్‌లో ఈ తరహా తొలి ఫెసిలిటీ అని మంత్రి వివరించారు. దీంతోపాటు బెంగళూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా ఏవియేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తుందని, ఫలితంగా బెంగళూర్‌లో ఎయిర్ ట్రాఫిక్ పెరగడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్ధిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని అన్నారు.
Read More :
Recovery Agents | వెంటపడి రుణాలు.. వేధించి వసూళ్లు.. ప్రాణాలు తీస్తున్న బ్యాంకు రికవరీ ఏజెంట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

