Apache Helicopter: అపాచీ హెలికాప్టర్ 250వ ఫ్యూసిలేజ్ను డెలివరీ చేసిన టాటా బోయింగ్
Apache Helicopter: అపాచీ హెలికాప్టర్ బాడీలు హైదరాబాద్‌లో తయారు అవుతున్న విషయం తెలిసిందే. అయితే 250వ ఫ్యూసిలేజ్ను ఉత్పత్తి చేసినట్లు ఇవాళ టాటా బోయింగ్ కంపెనీ ప్రకటించింది. ఆ బాడీని డెలివరీ చేసినట్లు కంపెనీ పేర్కొన్నది. అమెరికన్ ఆర్మీతో పాటు భారత ఆర్మీకి కూడా ఆ హెలికాప్టర్లను అమ్ముతున్నారు.
హైదరాబాద్: ఏహెచ్-64 అపాచీ యుద్ధ హెలికాప్టర్ల(Apache Helicopter)కు చెందిన ఫ్యూసిలేజ్ బాడీలను హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్యూసిలేజ్ భాగానికి చెందిన 250వ బాడీని ఇవాళ డెలివరీ చేశారు. దీనిపై ఆ కంపెనీ ఇవాళ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ఫ్యూసిలేజ్‌లను టాటా కంపెనీ తయారు చేస్తోంది. అమెరికా ఆర్మీతో పాటు ఇతర దేశాలు కూడా ఆ బాడీలను కొనుగోలు చేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ కూడా ఆరు అపాచీ ఫ్యూసిలేజ్‌లను ఆర్డర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో తమ కంపెనీ కట్టుబడి ఉందని టీబీఏఎల్ పేర్కొన్నది. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నట్లు చెప్పింది. టాటా కంపెనీ రక్షణ ఉత్పత్తుల కోసం సుమారు 900 మంది ఇంజినీర్లను రిక్రూట్ చేసుకున్నది. దీంట్లో టెక్నీషియన్లు, రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ నిపుణులు ఉన్నారు.
Tata Boeing Aerospace Limited (TBAL) has delivered the 250th fuselage for the AH-64 Apache attack helicopter from its state-of-the-art facility in Hyderabad.@Boeing_In #TASL #defencecapabilities #cuttingedgetechnologies #manufacturing #fuselage pic.twitter.com/4mHclQwVNX
— Tata Advanced Systems (Tata Aerospace & Defence) (@tataadvanced) December 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

