న్యూఢిల్లీ: బిల్లుల క్లియరెన్స్ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. దాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. సుప్రీంకోర్టును ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద ఆమె సుప్రీంను వివరణ కోరారు. సుప్రీంను వివరణ కోరిన అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) స్పందించారు. ఆ రిఫరెన్స్ను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుదోవ పట్టించినట్లు అవుతుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.
బీజేపీ ఆదేశాల ప్రకారమే తమిళనాడు గవర్నర్ తమ రాష్ట్ర బిల్లులను ఆపినట్లు స్టాలిన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏజెండ్లు అయిన గవర్నర్ల ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీన పరిచే ప్రక్రియ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు నాన్ బీజేపీ రాష్ట్రాలు ఒక్కటి కావాలని ఆయన కోరారు.
రాష్ట్రపతి ముర్ము చేసిన రిఫరెన్స్కు సమాధానం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లుకు ఆమోదం ఆలస్యం అయితే, అప్పుడు ఆ బిల్లులకు ఓకే చెప్పినట్లేనా అని ఆమె సుప్రీంను ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో కూడిన లేఖను రాష్ట్రపతి పంపారు.
I strongly condemn the Union Government’s Presidential reference, which attempts to subvert the Constitutional position already settled by the Hon’ble Supreme Court in the Tamil Nadu Governor’s case and other precedents.
This attempt clearly exposes the fact that the Tamil Nadu…
— M.K.Stalin (@mkstalin) May 15, 2025