Vishal | పొలిటికల్ ఎంట్రీపై నటుడు విశాల్ క్లారిటీ
Vishal : తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడగానే మరో హీరో విశాల్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. త్వరలోనే విశాల్ రాజకీయ పార్టీ పెడతారని పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.
Vishal : తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడగానే మరో హీరో విశాల్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. త్వరలోనే విశాల్ రాజకీయ పార్టీ పెడతారని పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. పొలిటికల్ ఎంట్రీపై రేగుతున్న దుమారంపై విశాల్ స్పందించారు. తాను ఇప్పట్లో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదని విశాల్ తేల్చిచెప్పారు. తాను రాజకీయ లబ్ధి కోసం పాకులాడే వ్యక్తిని కాదని, ప్రజలకు సేవ చేయాలనే అంకితభావం తనకుందని అన్నారు. భవిష్యత్‌లో పరిస్ధితులు మారితే ప్రజలకు మార్గదర్శకత్వం వహించేందుకు తాను సిద్ధమని చెప్పారు.
భవిష్యత్‌లో పరిస్ధితులు నిర్ధేశిస్తే ప్రజల్లో ఒకడిగా వారి గొంతుక వినిపిస్తానని చెప్పుకొచ్చారు. కాగా, 2017లో రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు విశాల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మాజీ సీఎం జయలలిత మరణంతో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ ప్రయత్నించగా ప్రిసైడింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
Read More :
Nitish Kumar | ప్రధాని మోదీతో భేటీ కానున్న నితీశ్ కుమార్.. బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీకై డిమాండ్..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

