చెన్నై : చెన్నైలోని కొలత్తూరులో డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. 2011 నుంచి ఇదే స్థానం నుంచి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను సమర్పించి ఆఫిడవిట్లో తనకు సొంత వాహనం లేదని పేర్కొన్నారు. రూ. 4.94 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తుల విలువ రూ. 2.24 కోట్లు. కాగా తన భార్య పేరు మీద చరాస్తులు రూ. 30,52,854తో పాటు రూ. 24.77 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన చేతిలో కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. 2016 ఎన్నికల సమయంలో సమర్పించిన ఆఫిడవిట్లో చరాస్తుల విలువ రూ. 80.33 లక్షలు అని, స్థిరాస్తుల విలువ రూ. 3.33 కోట్లుగా పేర్కొన్నారు.
స్టాలిన్ కుమారుడు ఉదయ్‌నిధి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉదయ్‌నిధి పేర చరాస్తులు రూ. 21.13 కోట్లు ఉన్నాయి.