చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరాసు ఇవాళ రాష్ట్ర బడ్జెట్(Tamil Nadu Budget)ను ప్రవేశపెట్టారు. తమకు రావాల్సిన సుమారు 2150 కోట్ల ను కేంద్రం రిలీజ్ చే్యడం లేదని ఆరోపించారు. హిందీ భాష అమలు వివాదం నేపథ్యంలో.. కేంద్రం మోసానికి పాల్పడినట్లు విమర్శించారు. శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెన్నరాసు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా స్కీమ్ కింద అందాల్సిన 2150 కోట్ల నిధుల్ని కేంద్రం రిలీజ్ చేయడంలేదన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు విషయంలో తమిళనాడులోని డీఎంకే సర్కారు, కేంద్రం మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
తమినాఢు ప్రభుత్వం ద్విభాషా విధానం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు మంత్రి తెలిపారు. తమ విధానం తమను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిందని, ఆ విధానం వల్లే ప్రపంచవ్యాప్తంగా తమిళులు రాణిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను వాడనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రభావం పడకుండా ఉండేందుకు.. ఉద్యోగుల జీతాల కోసం నిధుల్ని ఉంచినట్లు చెప్పారు.
బడ్జెట్‌ను నిరసిస్తూ బీజేపీ ఇవాళ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసింది. ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర లిక్కర్ యూనిట్లో జరిగిన కుంభకోణం గురించి అన్నాడీఎంకే నేతలు అసెంబ్లీలో లేవనెత్తారు.