న్యూఢిల్లీ: ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించినట్టు తెలిసింది. ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్ర ఉందన్న సంగతిని ఎన్ఐఏ విచారణలో అతడు అంగీకరించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పాక్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్గా ఉన్నాననే సంగతిని ఎన్ఐఏ అధికారులకు అతడు తెలిపినట్టు సమాచారం.
అంతేకాదు తాను, తన స్నేహితుడైన డేవిడ్ హెడ్లీకి పాక్కు చెందిన లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్నట్టు కూడా రాణా అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి.