Nirbhaya fund | ఎమ్మెల్యేల రక్షణ కోసం ఆ వాహనాలు.. విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చిన షిండే ప్రభుత్వం..!
Nirbhaya fund | నిర్భయ నిధులతో పోలీసుల కోసం కొనుగోలు చేసిన బొలేరో వాహనాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమైన శివసేన ఎమ్మెల్యేల రక్షణ కోసం వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు అందుబాటులో లేక పోలీసులు కండిషన్లో లేని పాతవాహనాలు ఉపయోగించుకోవాల్సి వస్తోంది. దీంతో వారి విధులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం దిగివచ్చింది. ముంబయి పోలీస్ మోటారు ట్రాన్స్పోర్ట్ యూనిట్ గ్యారేజీలో సోమవారం సాయంత్రం పార్క్ చేసిన కొన్ని బొలేరో వాహనాలను రాత్రి సమయంలో తిరిగి పోలీసు స్టేషన్లకు తరలించింది. శివాజీ నగర్, ఘట్కోపర్, ములుంద్ పోలీస్ స్టేషన్లకు తరలించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో నిర్భయ నిధులతో 220 బొలెరో వాహనాలు కొనుగోలు చేసింది. వీటిలో 47 వాహనాలను ఎమ్మెల్యేలకు రక్షణ కోసం పంపించింది. కొద్ది వారాల తర్వాత 17 వాహనాలను తిరిగి ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించింది. మిగిలిన 30 వాహనాలు ఎమ్మెల్యేల కాన్వాయ్‌లలోనే ఉంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?