Man Kills Lover | గర్భవతి అయిన ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన డ్రింక్ తాగించి హత్య
Man Kills Lover | గర్భం దాల్చిన ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడటంపై ప్రియుడు అనుమానించాడు. విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించి కూల్‌గా హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
ముంబై: గర్భం దాల్చిన ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడటంపై ప్రియుడు అనుమానించాడు. విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించి కూల్‌గా హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Kills Lover) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. చెంబూర్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ఆశిష్ మగర్, తన ప్రియురాలైన 19 ఏళ్ల విష్ణుమాయ, ఆమె బంధువైన మహిళతో కలిసి వారి ఇంట్లో నివసిస్తున్నాడు. రెండున్నర నెలల గర్భవతి అయిన విష్ణుమాయ ఆగస్ట్ 25న మరో ఫ్రెండ్‌తో కలిసి ఉండటం ఆశిష్ చూశాడు. ఆమెపై అతడు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ జంట మధ్య వాగ్వాదం జరిగింది. అయితే కొద్దిసేపటికే ఆ గొడవ సద్దుమణిగింది.
కాగా, ఆ గొడవ తర్వాత ఆశిష్ విషం కలిపిన కూల్ డ్రింక్‌ను విష్ణుమాయకు ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు విష్ణుమాయ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విషం సేవించడం వల్లే ఆమె మరణించినట్లు రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆ యువతి మరణంపై పోలీసులు దర్యాప్తు చేశారు.
మరోవైపు విష్ణమాయ మరణానికి ముందు ప్రియుడు ఆశిష్‌తో గొడవ జరిగినట్లు పోలీసులకు తెలిసింది. అలాగే అతడు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా ఆమె తమకు చెప్పిందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆశిష్‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు బుకాయించేందుకు ప్రయత్నించినప్పటికి ఆధారాల మేరకు నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఆశిష్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు పోలీస్ అధికారి తెలిపాడు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Infidelity
- Kills
- Lover
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

