లక్నో: భారత మిలటరీ రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వ్యక్తిని లక్నోలో అరెస్ట్ చేశారు. యూపీలోని గొండాకు చెందిన రయీస్ మిలటరీ స్థావరాల సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తుండగా యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ తరఫున గూఢచార్యం చేస్తున్నట్టు అతను అంగీకరించాడని స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ముంబైకి చెందిన అర్మాన్ ఇతడిని పాకిస్థాన్ ఏజెంట్‌గా పనిచేయమని పంపాడన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు.