డిల్లీ, నవంబర్ 27 : సంగీతంతో రాళ్లను కరిగించవచ్చని పెద్దలు చెప్తుంటారు. ఢిల్లీ లోక్‌నాయక్ హాస్పిటల్‌లోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ వైద్యుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.20-45 ఏండ్ల వయస్సు కలిగిన 56 మంది రోగులపై 11 నెలలపాటు ఈ అధ్యయనం చేశారు.
సర్జరీ సమయంలో రోగులకు శ్రావ్యమైన ఫ్లూట్, పియానో మ్యూజిక్ వినిపించారు. కొందరు రోగులు మ్యూజిక్ వినడానికి ఇష్టపడలేదు. మరికొందరు సర్జరీ అయ్యేవరకు మ్యూజిక్ వింటూనే ఉన్నారు. సర్జరీ ఫలితాలను విశ్లేషించగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. మ్యూజిక్ విన్నవారిలో రికవరీ వేగంగా జరిగినట్టు అధ్యయనంలో తేలింది.