PM Modi Degree: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
PM Modi Degree: ప్రధాని మోదీ డిగ్రీపై గతంలో కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో గుజరాత్ వర్సిటీ పరువునష్టం దావా వేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీ సుప్రీంను ఆశ్రయించారు. కానీ కేజ్రీ పిటీషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ డిగ్రీ(PM Modi degree) విద్యార్థులపై నమోదు అయిన కేసులో.. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఇవాళ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై గుజరాత్ యూనివర్సిటీ పరువునష్టం కేసును దాఖలు చేశారు. ఆ కేసులో ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేశారు. ఆ సమన్లను కొట్టివేయాలని కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టివేసేందుకు సుప్రీం నిరాకరించింది.
జస్టిస్ హృషికేశ్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. గతంలో ఇదే కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్ వేసిన పిటీషన్‌ను కొట్టివేసినట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయితే కేజ్రీవాల్ తరపున సీనియన్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదించారు.
సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భిన్నమైనవి ఆయన కోర్టుకు చెప్పారు. కానీ ఆ పిల్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. సంజయ్ సింగ్‌పై కూడా గుజరాత్ వర్సిటీ కేసు బుక్ చేసిందని, ఈ కేసులో ఒకవిధమైన ఆదేశాలు ఉండాలని, అందుకే కేజ్రీవాల్ పిటీషన్‌ను స్వీకరించడం లేదని, దాన్ని డిస్మిస్ చేస్తున్నామని కోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

