Polygamy, Nikah-Halala | బహుభార్యత్వం, నిఖా-హలాలపై పిటిషన్లు.. కొత్త ధర్మాసనం ఏర్పాటుకు ‘సుప్రీం’ ఒకే..!
Polygamy, Nikah-Halala | బహుభార్యత్వం, నిఖా-హలాలాపై దాఖలైన కేసులను పరిశీలిచేందుకు కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయా పద్ధతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తాజాగా రాజ్యాంగ
Polygamy, Nikah-Halala | బహుభార్యత్వం, నిఖా-హలాలాపై దాఖలైన కేసులను పరిశీలిచేందుకు కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయా పద్ధతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు తాజాగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ ధర్మాసనం ఎదుట బుధవారం న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ముస్లింల బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి ప్రకటించాలని పిటిషన్లో కోరారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తా ధర్మాసనం పదవీ విరమణ చేసిందని, కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశ్విని ఉపాధ్యాయ సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొత్తగా బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు నిఖా-హలాల, బహుభార్యత్వం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంను ఆశ్రయించింది. పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇవి ఏర్పడ్డాయని, వీటి చట్టబద్ధతను ప్రాథమిక హక్కుల పేరిట ఎవరూ ప్రశ్నించజాలరని ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది.
తమ విశ్వాసాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క ముస్లిమేతరులనూ అనుమతించరాదని కోర్టును కోరింది. ఇస్లాం నియమాల ప్రకారం.. విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ భర్తకు విడాకులైనా ఇవ్వాలి. లేదంటే అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసి ఉండడాన్ని ఇస్లాం అంగీకరిస్తుంది. గతంలో ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

