Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు ‘సుప్రీం’ రిలీఫ్..! గుజరాత్ సర్కారుకు నోటీసులు..!
Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది.
Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై తీస్తా సీతల్వాడ్‌పై కేసు నమోదైంది. అయితే, ఆ కేసులో గుజరాత్ ఏటీఎస్ తీస్తాను అదుపులోకి తీసుకుంది.
రెండు నెలల పాటు ఆమె జైలులో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తీస్తా సీతల్వాడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్‌లో తీస్తా సీతల్వాడ్కు ఊరట లభించింది. అప్పటి నుంచి మధ్యంతర బెయిల్‌పై ఆమె బయట ఉన్నారు. సాధారణ బెయిల్ కోసం తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇందుకు తిరస్కరించింది. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

