Supreme Court | కేరళ ప్రభుత్వం పిటిషన్‌పై కేంద్రం, గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..!
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఎనిమిది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపుడం సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. స్పందించిన సుప్రీంకోర్టు విచారణకు రావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి కోర్టు నోటీసులు జారీ చేసింది. లేదంటే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానైనా రావాలంటూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం తాను శాసనసభలో భాగమని గవర్నర్ అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు.
గత ఏడు నుంచి 21 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎనిమిది బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీవ్ర జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం తన పిటిషన్లో ఆరోపించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం ఇదే తరహాలో గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్టాలిన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను డిసెంబర్ ఒకటో తేదీకి సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

