న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పౌరసత్వ చట్టం సెక్షన్ 6ఏ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అక్రమ వలసలకు అస్సాం ఒప్పందం ఒక రాజకీయ పరిష్కారమని సీజేఐతో కూడిన అయిదుగురు జడ్జిల ధర్మాసనం తెలిపింది. తీర్పు సందర్భంగా సీజేఐ, మరో ముగ్గురు జడ్జిలు అభిప్రాయాన్ని తెలుపుతూ ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అస్సాంలో వలసదారులు ఎక్కువన్నారు.
అలాంటి ప్రొవిజన్‌ను చేసే శాసనాధికారం పార్లమెంట్‌కు ఉందన్నారు. 25-3-1971 కటాఫ్ తేదీగా నిర్ణయించడం సరైనదేనన్నారు. జస్టిస్ జేబీ పార్దివాలా మాత్రం సెక్షన్ 6ఏ రాజ్యాంగ విరుద్ధమని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. అస్సాం ఒప్పందం కింద పౌరసత్వం పొందే వారి కోసం పౌరసత్వ చట్టంలో సెక్షన్ 6ఏను ప్రత్యేక ప్రొవిజన్‌గా ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్ ప్రకారం 1-1-1966 నుంచి 25-3-1971 మధ్యలో అస్సాంకు వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు.