న్యూఢిల్లీ: పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో చాలా కాలేజీలు సీట్లను విస్తృతంగా బ్లాక్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నీట్-పీజీ కోసం అన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు ప్రీ కౌన్సెలింగ్ ఫీజును తప్పనిసరిగా బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సీట్లను బ్లాక్ చేయడం వల్ల వాస్తవ సీట్లు ఎన్ని ఉన్నాయో చెప్పకుండా వక్రీకరణ జరుగుతున్నదని, ఆశావహుల్లో అసమానతను పెంచుతున్నదని, మెరిట్ ప్రాతిపదికన పొందగలిగే అవకాశాలను తగ్గిస్తున్నదని ధర్మాసనం పేర్కొంది. ఇక నుంచి అన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు ప్రీ కౌన్సెలింగ్ ఫీజ్ గురించి వెల్లడించాలని ఆదేశించింది. అన్ని రకాల చార్జీలు స్పష్టంగా వివరించాలని పేర్కొంది. అలాగే జాతీయ వైద్య కమిషన్ కింద కేంద్రీకృత ఫీజు నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.