న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(Asaram Bapu)కు.. సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు ఆయనకు బెయిల్ ఇచ్చారు. మెడికల్ గ్రౌండ్స్ మీద 86 ఏళ్ల ఆశారాం బాపుకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను పాస్ చేసింది. ఆశారాం బాపు తరపున సీనియర్ న్యాయవాది దేవదత్త కమాత్ వాదించారు. ఆయనతో పాటు అడ్వకేట్లు రాజేశ్ గులాబ్ ఇనాందార్, శాశ్వత్ ఆనంద్ కూడా ఉన్నారు.
ఆశారాం బాపు అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలని. జోద్‌పూర్‌లోని అతన ఆశ్రమంలో ఓ టీనేజ్ అమ్మాయిని రేప్ చేసిన ఘటనలో అతన్ని అరెస్టు చేశారు.జోద్పూర్ కేసులో బెయిల్ దొరికినా.. మరో రేప్ కేసులో అతని పేరు ఉన్న కారణంగా ఇప్పుడే అతను జైలు విడిచి బయటకు రాలేరు. 2013లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఓ మహిళను కూడా లైంగికంగా వేధించినట్లు ఆశారాంపై ఆరోపణలు ఉన్నాయి.
మార్చి 31వ తేదీ వరకు బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. రిలీజైన తర్వాత ఆయన తన ఫాలోవర్లను కలుసుకోరాదు అని కోర్టు చెప్పింది.