న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వార్డుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలిందిగా దేశంలోని అన్ని దవాఖానలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆలిండియా కన్జూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ (ఏసీపీఏ) అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలు ఇవ్వడానికి దవాఖానలు.. పోలీస్ స్టేషన్లు కాదని పేర్కొంది. రోగుల వ్యక్తిగత గోప్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది. రోగులకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ చీటీలో వైద్యులు ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మందుల పేర్లను రాయాలన్న ఏసీపీఏ విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది.