న్యూఢిల్లీ: ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)ని రాసేందుకు ఎల్ఎల్బీ ఫైనలియర్ విద్యార్థులను ఈ ఏడాది అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2023లో ఈ అంశంపై ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఏఐబీఈ నిబంధనలను బీసీఐ రూపొందించలేదని తెలుసుకుని ధర్మాసనం అవాక్కయింది.
9 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ పరీక్ష నవంబరు 24న జరుగుతుంది.