Sunetra Pawar : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) దుర్మరణంతో నెలకొన్న రాజకీయ శూన్యతకు తెరపడింది. తదుపరి ఉపముఖ్యమంత్రి ఆయన భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) నియామకం ఖరారైంది. దివంగత అజిత్ దాదా స్థానంలో ఆమె శనివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె.. ఎన్సీపీ సీనియర్ నేతల ప్రతిపాదనను అంగీకరిస్తూ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర గుర్తింపు సాధించనున్నారు.
బారమతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCPని నడిపించేది ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాన్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవార్ స్థానాన్ని ఆశించారు కూడా. అయితే.. కొందరు సీనియర్ నాయకులు మాత్రం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పేరును ప్రతిపాదించారు. రాజకీయ దురంధరుడైన అజిత్ దాదా వారసత్వాన్ని కొనసాగించేందుకు సునేత్రనే సరైన వ్యక్తి అని వారందరూ తీర్మానించారు.
Sunetra Pawar, wife of late Ajit Pawar Likely To Be First Woman Deputy CM Of Maharashtra, Oath Tomorrow:
*She has been serving as a Member of Parliament in the Rajya Sabha (Upper House) representing Maharashtra since June 2024.
*Apart from politics, she is involved in… pic.twitter.com/MlcQdXSk83
— Viक़as (@VlKAS_PR0NAM0) January 30, 2026
ఇదే విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్తో కూడా వారు చర్చలు జరిపారు. ఫడ్నవీస్ సైతం సునేత్రను డిప్యూటీ సీఎంగా నియమించేందుకు ఆమోద ముద్ర వేశారని సమాచారం. శనివారం సాయంత్రం 5 గంటలకు సునేత్ర ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న సునేత్ర ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో తన భర్త అజిత్ స్ఫూర్తితో ముందుకు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక ఆమె ఎక్సైజ్, క్రీడా శాఖలు చూసుకుంటారని సమాచారం.
#WATCH | Baramati | Maharashtra Deputy CM late Ajit Pawar’s ashes were immersed in Songaon at the confluence (sangam) of the Karha and Nira rivers.
Parth Pawar and Jay Pawar, sons of Maharashtra Deputy CM late Ajit Pawar, performed rituals. Sunetra Pawar, wife of Maharashtra… pic.twitter.com/SBrcUyWiST
— ANI (@ANI) January 30, 2026
జనవరి 28న ఉదయం జడ్జీ ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన అజిత్ పావర్ బారామతిలో విమానం కుప్పకూలడంతో దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, ఫ్లైట్ సహాయకురాలు, పవార్ వ్యక్తిగత సహాకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం అధికార లాంఛనాలతో బారమతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించారు.