National Commission for Men: జాతీయ పురుషుల కమిషన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్
National Commission for Men: జాతీయ పురుషుల కమిషన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పెళ్లి అయిన పురుషులు ఎక్కువ సంఖ్యలో సూసైడ్ చేసుకుంటున్నారని, వాళ్ల కేసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ వేశారు.
న్యూఢిల్లీ: గృహహింస(domestic violence) వల్ల చనిపోతున్న పెళ్లి అయిన మగవారి సమస్యలను పరిష్కరించాలని, అలాంటి వారి కేసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఇవాళ సుప్రీంకోర్టు(supreme court)లో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ మెన్(National Commission for Men) ఈ అంశాలను పరిశీలించాలని పిటిషన్లో కోరారు. అడ్వకేట్ మహేశ్ కుమార్ తివారి తన అభ్యర్థనలో జాతీయ నేర గణాంకాల బ్యూరో(NCRB) డేటాను ప్రస్తావించారు. 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దాంట్లో 81,063 మంది వివాహిత పురుషులు, 28,680 మంది పెళ్లి అయిన మహిళలు ఉన్నట్లు తెలిపారు.ఫ్యామిలీ సమస్యల వల్లే సుమారు 33.2 శాతం మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దాంట్లో కేవలం మ్యారేజ్ సమస్యల వల్ల 4.8 శాతం మంది బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు.
2021లో మొత్తం 1,18,979 మంది పురుషులు సూసైడ్(Suciding Men) ద్వారా ప్రాణాలు వదిలారని, అది 72 శాతంగా ఉందని, ఇక 45,026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని, వాళ్లది 27 శాతంగా ఉన్నట్లు పిటిషన్లో తెలిపారు. ఎన్సీఆర్బీ ఇచ్చిన డేటా ఆధారంగా అడ్వకేట్ తివారీ(Advocated Tiwari) ఈ విషయాలను ప్రస్తావించారు. పెళ్లి అయిన పురుషుల సమస్యలను పరిష్కరించాలని, వాళ్ల ఫిర్యాదులను గృహ హింస కింద స్వీకరించాలని, దీనిపై మార్గదర్శకాలు ఇవ్వాలని తన పిటిషన్లో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని(National Human Rights Commission) కోరారు. నేషనల్ కమీషన్ ఫర్ మెన్ను ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

