Sudhanshu Trivedi | రాజకీయాల్లో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు తగవు : రాహుల్‌పై బీజేపీ ఎంపీ ఫైర్
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు.
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ కొంత పరిణితిని ప్రదర్శించాలని హితవు పలికారు. సుధాన్షు త్రివేది గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రాజకీయాల్లో హింసాత్మక వాక్చాతుర్యం ప్రయోగించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నదని అన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, అమెరికా అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలు అంతర్జాతీయ రాజకీయ హింసకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తరచూ హింస, హత్య అనే పదాలు ఉపయోగిస్తుండటం దీర్ఘకాలంలో ఇలాంటి ఘటనలకు ప్రేరేపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పద ప్రయోగాలను ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత ప్రయోగించడం ఆందోళన రేకెత్తిస్తోందని త్రివేది పేర్కొన్నారు. 2021లో పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రస్తావించారు.
Read More :
Maoists | బీజాపూర్‌లో మావోయిస్టుల మందుపాతర.. ఇద్దరు జవాన్లు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

