‘పెళ్లి అంటే ఏమిటి?’… ఒక విద్యార్థి ఏం రాశాడో చదివితే నవ్వు ఆపుకోలేరు
సోషల్ టీచర్ ‘నాన్ సెన్స్’ అని దానిపై రాయడంతోపాటు పదికి సున్నా మార్కులు వేశారు. అలాగే ఆ విద్యార్థి తనను కలవమంటూ చివరన రాసిన నోట్లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ‘పెళ్లి అంటే ఏమిటి?’ అనే అంశంపై ఒక విద్యార్థి రాసిన వ్యాసం చదివితే మీరు నవ్వు ఆపుకోలేరు. అంతగా నవ్వు తెప్పించేలా అతడు ఏం రాశాడంటే… ‘ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో ఇలా అన్నప్పుడు పెళ్లి జరుగుతుంది. ‘నువ్వు ఇప్పుడు పెద్ద అయ్యావు. ఇక నీకు ఆహారం ఇవ్వలేం. నిన్ను పోషించే వ్యక్తిని వెతుక్కోవడం మంచిది’ అని అంటారు. దీంతో ఆ అమ్మాయి ఒక వ్యక్తిని కలుసుకుంటుంది. ‘నువ్వూ పెద్ద అయ్యావు. ఆమెను పెళ్లి చేసుకోవాలి’ అంటూ అతడి తల్లిదండ్రులు గసురుతారు. దీంతో ఆ ఇద్దరూ (అమ్మాయి, అబ్బాయి) తమను తాము పరీక్షించుకుని సంతోషిస్తారు. అప్పుడు కలిసి జీవించడానికి అంగీకరిస్తారు. ఆ తర్వాత పిల్లలను కనడానికి అర్ధంలేని పని చేయడం ప్రారంభిస్తారు’ అని ఇంగ్లీష్‌లో రాశాడు. దీంతో సోషల్ టీచర్ ‘నాన్ సెన్స్’ అని దానిపై రాయడంతోపాటు పదికి సున్నా మార్కులు వేశారు. అలాగే ఆ విద్యార్థి తనను కలవమంటూ చివరన రాసిన నోట్లో పేర్కొన్నారు.
కాగా, విద్యార్థి రాసిన జవాబు పత్రం ఫొటోను ఒక యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చదివిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేక లాఫింగ్ ఇమోజీలతో తెగ స్పందించారు. పెళ్లి గురించి ఆ విద్యార్థి రాసిన వ్యాసాన్ని కొందరు లైక్ చేశారు. సో ఫన్నీ అంటూ కితాబు ఇచ్చారు. ‘స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన అమాయకత్వం’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Paari | Panchavan Paarivendan (@PaariPanchavann) October 11, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

