Student Rammed By Car | రోడ్డు దాటుతున్న విద్యార్థి.. తర్వాత ఏం జరిగిందంటే?
Student Rammed By Car | హిట్ అండ్ రన్ కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న ఒక విద్యార్థిని కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ అతడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: హిట్ అండ్ రన్ కేసులు ఇటీవల పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న ఒక విద్యార్థిని కారు ఢీకొట్టింది. (Student Rammed By Car) అయితే అదృష్టవశాత్తూ అతడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 23న కాలేజీ విద్యార్థి రోడ్డు దాటుతున్నాడు. అతడ్ని తప్పించుకుని ఒక కారు వెళ్లింది. అయితే వేగంగా వచ్చిన హ్యుందాయ్ క్రెటా కారు టర్న్ తీసుకుని మరీ ఆ విద్యార్థిని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
కాగా, కారు ఢీకొట్టడంతో ఆ విద్యార్థి రోడ్డుపై పడ్డాడు. అయితే అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
📽️ Watch | On CCTV, Student Crossing Road Rammed By Creta In Noida https://t.co/u04aL4EU6o pic.twitter.com/8RDJEVRFm6
— NDTV (@ndtv) May 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Crossing Road
- Noida
- Rammed
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

