Shruti Chaturvedi : ఇన్ఫ్లూయెన్సర్ శృతి చతుర్వేది (Shruti Chaturvedi) కి అమెరికా (USA) లోని అలస్కా ఎయిర్‌పోర్టు (Alaska airport) లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె పవర్ బ్యాంకు (Power bank) అనుమానాస్పదంగా కనిపించిందని చెప్పి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను 8 గంటలపాటు నిర్బంధించారు. ఆమె వేసుకున్న గరం కోటు (Warm wear) ను విప్పించి ఏసీ గదిలో కూర్బోబెట్టారు. కనీసం వాష్ రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేదు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే శృతి చతుర్వేది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. చాయ్‌పానీ పేరుతో ఆమె ఒక పబ్లిక్ రిలేషన్ సంస్థను నడుపుతున్నారు. ఇటీవల అమెరికాకు వెళ్లిన ఆమెకు అలస్కాలోని యాంకర్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. పవర్ బ్యాంక్ అనుమానాస్పదంగా ఉందని సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఏకంగా ఎనిమిది గంటలపాటు నిర్బంధించారు.
ఏసీ గదిలో కూర్చోబెట్టి వార్మ్ వేర్‌ను విప్పేయించారు. మహిళా సెక్యూరిటీతో కాకుండా మేల్ సెక్యూరిటీనే ఆమెను తనిఖీ చేశారు. వాష్ రూమ్‌కు వెళ్తానన్నా వెళ్లనివ్వలేదు. ఫోన్ మాట్లాడనివ్వలేదు. ఈ విషయాన్ని శృతి చతుర్వేది సోషల్ మీడియా ద్వారా భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేసింది.