బాబాయ్, అబ్బాయ్ మధ్య మళ్లీ లుకలుకలు… మీటింగ్‌కు శివపాల్‌ను ఆహ్వానించని అఖిలేష్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మధ్య మళ్లీ లుకలుకలు తలెత్తెనట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్లు వారిద్దరూ సంకేతాలిచ్చారు. అఖిలేష్‌తో కలిసి శివపాల్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎస్పీ టికెట్‌పై జస్వంత్‌నగర్ స్థానంలో పోటీ చేసి గెలిచారు.
అయితే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించలేకపోయింది. మళ్లీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బాబాయ్ శివపాల్, అబ్బాయ్ అఖిలేష్ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తున్నది. సమాజ్‌వాదీ పార్టీ శాసన సభా సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్‌ను పార్టీ సభా నేతగా ఎన్నుకున్నారు. దీంతో యూపీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఆయన వ్యవహరించనున్నారు.
కాగా, కీలకమైన ఈ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ ఆరోపించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తాను అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతోపాటు రెండు రోజులుగా ఎదురుచూసినట్లు ఆయన తెలిపారు. తాను సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎస్పీఎల్పీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని వాపోయారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో శనివారం మాట్లాడిన ఆయన ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు.
Lucknow | I was not invited to the party meeting. I waited for 2 days and cancelled all my programs for this meeting but I wasn't invited. I am an MLA from Samajwadi Party but still not invited: SP MLA Shivpal Singh Yadav on party's legislative meeting pic.twitter.com/DOyCXV9cPg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 26, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

