లక్నో: హోలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ ముదరడంతో రాళ్ల దాడికి దారి తీసింది. (Stone Pelting) ఈ సంఘటనలో పది మంది గాయపడ్డారు. 32 మంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చౌముహాలోని బాటి గ్రామంలో హోలీ వేడుక హింసాత్మకంగా మారింది. అగ్ర వర్గానికి చెందిన ఇద్దరు బాలురు ఎస్సీలు నివసించే ప్రాంతంలోని పిల్లలకు బలవంతంగా హోలీ రంగులు పూసేందుకు ప్రయత్నించారు.
కాగా, నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ జరిగింది. తొలుత పిల్లల మధ్య మొదలైన గొడవ పెద్దల వరకు వ్యాపించింది. దీంతో ఇరు వర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పది మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. రాళ్ల దాడిలో గాయపడిన పది మందిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణ, రాళ్ల దాడికి సంబంధించి ఇరు వర్గాలకు చెందిన 32 మందిపై కేసు నమోదు చేశారు.
కాగా, నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగతా వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. అయితే ఈ రాళ్ల దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश के मथुरा के बाटी गांव में रंग लगाने को लेकर हुआ बबाल
– दो पक्षों में हुई जमकर मारपीट, दोनों तरफ से चले ईंट पत्थर
– मारपीट में 10 लोग हुए घायल, घायलों को अस्पताल में कराया गया भर्ती
– पत्थरबाजी का वीडियो आया सामने, थाना जैंत इलाके के बाटी गांव की घटना…… pic.twitter.com/wyBPHuJJk5— Nedrick News (@nedricknews) March 15, 2025