అహ్మదాబాద్: గుజరాత్(Gujarat)లోని అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు భద్రతలో భాగంగా సిటీలో పెట్టిన పోస్టర్లు వివాదానికి దారి తీశాయి. ఇంట్లోనే ఉంటే, అత్యాచారాలు జరగవని వెలసిన పోస్టర్లపై విమర్శలు వస్తున్నాయి. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పోస్టర్లను పెట్టారు. దీంతో గుజరాత్ మహిళ భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అర్థరాత్రి పార్టీలకు హాజరుకావొద్దు అని, ఒకవేళ పార్టీలకు వెళ్తే అత్యాచారం లేక గ్యాంగ్ రేప్ జరిగే అవకాశాలు ఉన్నట్లు పోస్టర్లలో రాశారు. చీకటి, నిర్జన ప్రదేశానికి స్నేహితుడితో వెళ్లవద్దు అని, ఎందుకంటే రేప్ కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరిగే అవకాశం ఉన్నట్లు పోస్టర్లలో హెచ్చరించారు. నగరంలోని సోలా, చంద్లోదియా ప్రాంతాల్లోని రోడ్ డివైడర్లపై పెట్టారు.
ఆ పోస్టర్లపై విమర్శలు రావడంతో వాటిని తొలగించారు. రోడ్డు భద్రత కోసం సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్టర్లను పెట్టినట్లు డీసీపీ నీతా దేశాయ్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతితో సతర్కతా అనే ఎన్జీవో ఆ వివాదాస్పద పోస్టర్లను తయారు చేసింది. స్కూల్, కాలేజీ పిల్లల్లో ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ఓ ఎన్జీవో తమను ఆశ్రయించిందని, కానీ వివాదాస్పద పోస్టర్లను తమకు చూపించలేదని ఆ డీసీపీ తెలిపారు. అయితే పోస్టర్లకు చెందిన అంశాన్ని తమ దృష్టికి తీసుకురాగానే వాటిని తొలగించినట్లు ఆమె చెప్పారు.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp હસ્તક ગૃહ વિભાગ અને પોલીસ, પોતાની નિષ્ફળતા સ્વીકારી જાહેરમાં બેન-દીકરીઓની સલામતી નથી એવા પોસ્ટર લગાવવા દે છે!
જે ગુજરાત દીકરીઓની સુરક્ષાનું ગૌરવ લેતું હતું, ત્યાં આજે પોલીસની જાણમાં અપમાનજનક બોર્ડ લાગી રહ્યા છે.
અત્યંત શરમજનક! pic.twitter.com/IQHiX7BXCB
— Gujarat Pradesh Congress Sevadal (@SevadalGJ) August 2, 2025