కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయికి చేరాయి. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ అగ్ర నేతల వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎంతో కాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నవారికి విలువ ఇవ్వడం లేదని, ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చినవారికి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ప్రధాన కార్యదర్శి అమితభ చక్రవర్తి తదితర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుదీర్ఘ కాలం నుంచి పార్టీకి విధేయంగా ఉన్న సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.