Stalin | విపక్ష భేటీ నుంచి దృష్టి మళ్లించేందుకే డీఎంకే మంత్రిపై ఈడీ దాడులు : స్టాలిన్
బెంగళూర్‌లో విపక్ష నేతల భేటీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుపై పొన్ముడి న్యాయ పోరాటం సాగిస్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) స్పష్టం చేశారు.
చెన్నై : మనీల్యాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. పొన్ముడి కుమారుడు, ఎంపీ గౌతం సిగమణి నివాసాల్లోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నై, విల్లుపురంలోని తండ్రీ కొడుకుల నివాసాలు, ఆస్తులపై ఈడీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
మోదీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీతో దాడులు చేయిస్తోందని పాలక డీఎంకే ఆరోపించింది. బెంగళూర్‌లో విపక్ష నేతల భేటీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుపై పొన్ముడి న్యాయ పోరాటం సాగిస్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Stalin) స్పష్టం చేశారు. గవర్నర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారని, ఇప్పుడు ఈడీ కూడా బీజేపీ తరపున బరిలో దిగిందని దుయ్యబట్టారు.
ఇదంతా ఎన్నికల్లో తమ అనుకూలతను పెంచుతుందని, ఈ డ్రామాలు బీజేపీకి అలవాటేనని ఆరోపించారు. పొన్ముడిపై ఇటీవల రెండు కేసులు కొట్టివేశారని, ఈ కేసును ఆయన న్యాయపరంగా ఎదుర్కొంటారని అన్నారు. పొన్ముడి 2007-2011 మధ్య రాష్ట్ర మైనింగ్ మంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసు ఎదుర్కొంటున్నారు. క్వారీ లైసెన్స్ నిబంధనలను పొన్ముడి ఉల్లంఘించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 28 కోట్ల నష్టం వాటిల్లిందనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయ.
Read More :
CHANDRAYAN3| చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మించిన ఇంజినీర్లకు ఏడాదికిపైగా జీతాలివ్వని కేంద్రం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

