Ratan Tata | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రఖ్యాత వ్యాపారవేత్త, నైతిక విలువలకు మారుపేరుగా నిలిచిన రతన్ టాటా వీలునామాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. నిరుడు అక్టోబర్ 9న రతన్‌టాటా మరణించాక ఆయన ఓ వ్యక్తికి తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని వీలునామాలో రాశారన్న విషయం సంచలనం కలిగించింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలిసింది. ఆయన జంషెడ్‌పూర్‌కు చెందిన మోటార్ డీలర్, స్టాలియన్ కంపెనీ యజమాని మోహినీ మోహన్ దత్తా అని తెలిసింది.
స్టాలియన్ కంపెనీ టాటా గ్రూప్‌లో విలీనమైంది. అంతకుముందు స్టాలియన్ కంపెనీలో దత్తాకు 80 శాతం, టాటా గ్రూప్‌కు 20 వాటా ఉండేది. టాటా కుటుంబంలో, వ్యాపార వర్గాల్లో మోహినీ మోహన్ దత్తా పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. రతన్ టాటా అంతిమ సంస్కారాలకు హాజరైన సందర్భంగా మోహినీ మోహన్ దత్తా టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.